ఎన్నికలకు సిద్ధం కండి
ప్రజలలో వెళ్లి సమస్యలపై పోరాడండి
మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం కేంద్రంలోని సాయి శరణం ఫంక్షన్ హాల్ లో మండల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిరహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ అని వర్గాల ప్రజలను మోసం చేసింది అని చెప్పారు బిసి రిజర్వేషన్ 42 % అమలు చేస్తామని చెప్పి బూరెలు మాటలు చెప్పి ఇప్పుడు చేతులెత్తేసారని చెప్పారు ఆరు గ్యారెంటీలలో ఈ యొక్క ఆమీ సరిగా నెరవేర్చలేదని మండిపడ్డారు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని తెలిపారు బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం అని అన్నారు కొట్లాడడం తమకు కొత్త ఏం కాదని తెలిపారు కార్యకర్తలు స్థానిక సంస్థలలో బలంగా పనిచేయాలని సూచించారు .
హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేశారని ఆగ్రహించారు రియల్ ఎస్టేట్ రంగంపై ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారని కాంగ్రెస్ దెబ్బకు వారు విలవిల్లాడుతున్నారని ఆరోపించారు పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక, తెచ్చిన అప్పులు చెల్లించలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పెట్టుబడిదారుల ఉసురు తీసుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చి రైతుల్లో కేసీఆర్ ఆత్మవిశ్వాసం నింపారని, వ్యవసాయ రంగానికి ఆయన వెన్నెముకగా నిలిచారని కీర్తించారు సీఎం రేవంత్ రెడ్డి పాలనలో సాగునీళ్లు అందక, కరెంట్ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు పండించిన పంటలు ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని, రైతుభరోసా, రుణమాఫీ అందక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇది ప్రజాపాలన కాదని, ప్రజలను వేధించే పాలనంటూ చురకలు అంటించారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ, చైర్మన్లు బిఆర్ఎస్ పార్టీ మండలం అధ్యక్షలు యువజన సంఘల అధ్యక్షులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు